వనపర్తి: తక్కువ ధరకే నాణ్యమైన జనరిక్ ఔషధాలు

56చూసినవారు
సరసమైన ధరలకు నాణ్యమైన జనరిక్ ఔషధాలను అందుబాటులో ఉంచే లక్ష్యంతో పీఎంబీజేపీ పథకాన్ని 2008లో భారత ప్రభుత్వం ప్రారంభించిందని వనపర్తి జీజీహెచ్ జన ఔషధీ కేంద్రం నిర్వాహకురాలు మైన అన్నారు. గురువారం వనపర్తి మండలం చిమనగుంటపల్లిలో జనరిక్ మందులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మైన మాట్లాడుతూ. దేశంలో ఇప్పటివరకు 13, 822 జన ఔషధీ కేంద్రాలు పేదల కోసం ఏర్పాటు అయ్యాయని అన్నారు. ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్