మంత్రి జూపల్లి కృష్ణారావువి ఉత్తర కుమార ప్రగల్భాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తిలో మాట్లాడుతూ. పార్టీలు మారినంత మాత్రానా చేసిన అభివృద్ధి నిజం కాకుండా పోతుందా అని విమర్శించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి చేసి లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చిన ఘనత కెసిఆర్ దని 90% పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసిన 10 %పూర్తి చేయలేని అసమర్థత ప్రభుత్వం రేవంత్ రెడ్డిదని దుయ్యబట్టారు.