వనపర్తి జిల్లా కేంద్రం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా సోమవారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. భారత మాజీ ప్రధాని బహుముఖ ప్రజ్ఞశాలి, దివంగత నేత పీవీ నరసింహారావు దేశానికి చేసిన సేవలను గుర్తు చేశారు. సంస్కరణలతో సంక్షోభ కాలాన్ని జయించి దేశాన్ని ముందుకు నడిపించిన పాలన సమర్థులు పీవీ అని అన్నారు.