ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL)కు భారత ప్రభుత్వం 'మహారత్న' హోదా కల్పించింది. భారతదేశంలో 14వ మహారత్న కంపెనీగా హెచ్ఏఎల్ నిలిచింది. ఈ అప్‌గ్రేడ్ గురించి పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ డిపార్ట్‌మెంట్ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసింది. HAL 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.28,162 కోట్ల వార్షిక టర్నోవర్, రూ.7,595 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.