నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో రాబోతున్న సెకండ్ సినిమా మోస్ట్ వైలెంట్‌గా ఉంటుందని, చిన్న పిల్లలను తీసుకెళ్లొద్దంటూ వస్తోన్న రూమర్స్‌పై మేకర్స్ స్పందించారు. ఇది తప్పుడు ప్రచారమని, రూమర్స్ వ్యాప్తి చేయొద్దని సూచించారు. తాము చేసే అధికారిక ప్రకటనలు మాత్రమే నమ్మాలని కోరారు. కాగా, ‘సరిపోదా శనివారం’ ప్రమోషన్స్‌లో నాని తన తరువాతి సినిమాపై చేసిన వ్యాఖ్యలతో ఈ రూమర్స్ స్టార్ట్ అయ్యాయి.