హిట్‌ అండ్‌ రన్‌ కేసులో మలయాళ నటుడు శ్రీనాథ్‌ భాసి అరెస్ట్‌

63చూసినవారు
హిట్‌ అండ్‌ రన్‌ కేసులో మలయాళ నటుడు శ్రీనాథ్‌ భాసి అరెస్ట్‌
హిట్‌ అండ్‌ రన్‌ కేసులో మలయాళ నటుడు శ్రీనాథ్‌ భాసి అరెస్ట్‌ అయ్యాడు. గత నెలలో శ్రీనాథ్‌ కారులో వెళ్తూ ఓ బైక్‌ను ఢీ కొట్టాడు. ఈ ఘటనలో బైకర్‌ తీవ్రంగా గాయపడగా.. శ్రీనాథ్‌ కారు ఆపకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎర్నాకులం సెంట్రల్‌ పోలీసులు తెలిపారు. ఈ కేసులో సోమవారం శ్రీనాథ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే, కొద్దిసేపటికే బెయిల్‌పై ఆయన్ని రిలీజ్‌ చేశారు.