ప్రమాదం జరిగినప్పుడు ఆసుపత్రిలో చేరడం, ప్రమాదవశాత్తు మరణ ఖర్చుల నుంచి ఆర్థికంగా రక్షించుకోవడం కోసం ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్ పాలసీ ఎంతో ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది. ఈ బీమా పాలసీ కవరేజీ అక్టోబర్ 25 నుంచి ప్రారంభమవుతుందని, ఫోన్‌పే యాప్‌లో నిమిషంలోపు దీనిని కొనుగోలు చేయవచ్చని కంపెనీ చెప్పింది. ఈ పాలసీని వినియోగదారులు వారి జీవిత భాగస్వామి, ఇద్దరు పిల్లలతో సహా నలుగురు కుటుంబ సభ్యులకు కూడా బీమా చేసుకోవచ్చని ప్రకటించింది.