ఇటీవల పెళ్లి వేడుకల్లో నోట్ల కట్టలు వెదజల్లడం ఒక ట్రెండ్‌లా మారిపోయింది. తాజాగా అలాంటి ఘటనే పాకిస్థాన్‌లోని సియాల్‌కోట్‌లో జరిగింది. ఓ వివాహ వేడుకలో వరుడి సోదరులు రూ.5 మిలియన్లకు పైగా డబ్బును వెదజల్లారు. వరుడి గ్రామమైన బఖ్రే వాలీలో ఊరేగింపు ప్రారంభంకాగా, ఊరేగింపు సంబ్రియాల్‌లోని కళ్యాణ మండపానికి చేరుకోగానే వరుడి సోదరులు, స్నేహితులు డబ్బుల వర్షం కురిపించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.