తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ బోర్డు మెంబర్, సీనియర్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంఘటన దురదృష్టకరమైన.. దైవ సన్నిధిలో ప్రాణాలను కోల్పోవడం అదృష్టమని పేర్కొన్నారు. ప్రభుత్వం మృతులకు రూ.25 లక్షలు నష్టపరిహారం ప్రకటించగా.. మృతుల కుటుంబసభ్యులకు ఆర్థిక సాయం చెక్కులు పంపిణీ చేసే సమయంలో ఆయన ఈ వాఖ్యలు చేశారు. ఈ క్రమంలో నెహ్రూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.