టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున నటించిన హిట్ సినిమాల్లో ‘మన్మథుడు’ ఒకటి. ఈ సినిమాలో నాగార్జున, బ్రహ్మనందం కామెడీ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. అయితే ఈ మూవీలో హీరోయిన్‌గా చేసిన అన్షు అంబానీ 23 ఏళ్ల తర్వాత మళ్లీ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుంది. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ‘మజాకా’ అనే సినిమాలో హీరోయిన్‌గా ఆఫర్ దక్కించుకుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.