డ్రైవర్ చాకచక్యంతో తప్పిన ప్రమాదం

82చూసినవారు
డ్రైవర్ చాకచక్యంతో తప్పిన ప్రమాదం
ఆర్టీసీ డ్రైవర్ చాకచక్యంతో త్రుటిలో ప్రమాదం తప్పిన సంఘటన బెల్లంపల్లి రైల్వే స్టేషన్ సమీప జాతీయ రహదారిపై మంగళవారం చోటుచేసుకుంది. ఎలాంటి సూచిక బోర్డులు ఏర్పాటు చేయకుండ రహదారి పక్కన ఉన్న భారీ వృక్షాన్ని తొలగించారు. ఈ నేపథ్యంలో జాతీయ రహదారిపై వస్తున్న ఆర్టీసీ బస్సు ముందు ఆ చెట్టు విరిగి కింద పడింది. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును చాకచక్యంతో నిలిపివేయడంతో తృటిలో ప్రమాదం తప్పినట్లు అయింది.

సంబంధిత పోస్ట్