బెల్లంపల్లి: ఆలయ భూములు కాపాడాలని రాస్తారోకో

55చూసినవారు
బెల్లంపల్లి రైల్వే స్టేషన్ ముందున్న సంజీవని ఆంజనేయస్వామి భూములను కాపాడాలని కోరుతూ ఆదివారం రాత్రి అభయాంజనేయ స్వామి దేవాలయ కమిటీ సభ్యులు, బిజెపి నాయకులు రాస్తారోకో చేశారు. రైల్వే స్టేషన్ ముందున్న రోడ్డుపై రాస్తారోకో నిర్వహించి నినాదాలు చేశారు. ఆంజనేయస్వామికి చెందిన భూములను జెసిబి లతో చదును చేయించి అక్రమంగా కబ్జా చేస్తున్నారని సమాచారంతో వారు అక్కడి చేరుకొని అడ్డుకునేందుకు యత్నించారు.

ట్యాగ్స్ :