Top 10 viral news 🔥
ఎన్టీఆర్ ‘దేవర’ ట్రైలర్ విడుదల
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దేవర’ సినిమా ట్రైలర్ విడుదలైంది. ముంబైలో జరిగిన ఓ ఈవెంట్లో మేకర్స్ ట్రైలర్ను విడుదల చేశారు. ట్రైలర్ ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. ఎన్టీఆర్-జాన్వీ కపూర్ లుక్స్, ఫైట్ సీన్స్, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలనిజం గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. ట్రైలర్ మూవీపై భారీగా అంచనాలు పెంచేసింది. కాగా, ఈ నెల 27న ‘దేవర’ ప్రేక్షకుల ముందుకు రానుంది.