ఇవాళ సీఎం చంద్రబాబు-భువనేశ్వరిల పెళ్లి రోజు. బుడమేరు సృష్టించిన బీభత్సం వల్ల సీఎం చంద్రబాబు ఆయన ఇంటికి వెళ్లకుండా విజయవాడ కలెక్టరేట్‌లోనే బస చేస్తున్నారు. దాంతో భర్తను కలిసేందుకు భువనేశ్వరి కలెక్టరేట్‌కు వచ్చారు. సీఎం చంద్రబాబుకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. సతీమణి భువనేశ్వరితో సీఎం చంద్రబాబు కాసేపు ముచ్చటించారు. అనంతరం తిరిగి ఆయన పనుల్లో నిమగ్నమయ్యారు.