‘దేవర’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టికెట్ల ప్రీసేల్ ద్వారానే వన్ మిలియన్ డాలర్ల మార్క్‌ను చేరడంపై ఎదురైన ప్రశ్నపై ఎన్టీఆర్ స్పందించారు. దైవ ఆశీస్సులు, అభిమానులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే అది సాధ్యమైందని పేర్కొన్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌లో రామ్ చరణ్‌తో కలిసి నటించా. ఆరేళ్ల తర్వాత నా సోలో మూవీగా ‘దేవర’ రిలీజ్ కానుంది. కాస్త టెన్షన్‌గా ఉంది. విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని అన్నారు.