తిరుపతిలోని సప్తగిరి నగర్‌లోని ఆటోస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపంలో రికార్డింగ్ డ్యాన్స్ హడావిడి కొనసాగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. వినాయక మండపంలో అశ్లీల నృత్యాలు చేయడంపై పలువురు విమర్శిస్తున్నారు. వినాయక చవితి వేడుకలు భక్తి శ్రద్ధలతో కొనసాగాలని, అశ్లీల నృత్యాలతో కాదని మండిపడుతున్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.