కన్నెపెల్లి మండలంలో స్వచ్ఛతా హి సేవ కార్యక్రమం పక్షోత్సవాలు సందర్భంగా అన్ని గ్రామ పంచాయతీ పరిధిలో గల గ్రామపంచాయతీ సిబ్బందికి శనివారం హెల్త్ చెకప్ చేయించడం జరిగింది. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలని పరిశుభ్రత పాటించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గంగా మోహన్, ఎంపీ ఓ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు రాజ్ కుమార్, తిరుపతి, రాకేష్, ఏఎన్ఎం లు, ఆశా వర్కర్లు మరియు ప్రజలు పాల్గొనడం జరిగింది.