నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత

68చూసినవారు
నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత
భీమారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆవడం ఎక్స్ రోడ్ వద్ద సోమవారం రూ. 3. 20 లక్షలు విలువ చేసే 107 కిలోల నిషేదిత నకిలీ పత్తి విత్తనాలను సిపి టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. చుండు నాగేశ్వర్ రావు అనే వ్యక్తి మూడు సంచులతో ఆటో కోసం ఎదురుచూస్తూ అనుమానాస్పదంగా కనిపించడంతో పట్టుకొని సంచులు తనిఖీ చేయగా నకిలీ విత్తనాలు లభించాయి. నిందితుడిని అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ కోసం పోలీస్ స్టేషన్లో అప్పగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్