పండుగ పూట నీటి కష్టాలు లేకుండా చూడాలి

55చూసినవారు
పండుగ పూట నీటి కష్టాలు లేకుండా చూడాలి
రాబోయే దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకొని మందమర్రి ఏరియాలో నీటి కష్టాలు లేకుండా ప్రతిరోజు సరఫరా చేయాలని ఏఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి సత్యనారాయణ కోరారు. మందమర్రిలో ఆయన మాట్లాడుతూ, వాల్యూ ఆపరేటర్లు, పంపు డ్రైవర్ లకు పండుగ వేళల్లో పీహెచ్డీ, హాలిడే మస్టర్ ఇవ్వకపోవడంతో మంచినీటి సరఫరాలో ఆటంకం కలుగుతుందని పేర్కొన్నారు. దీంతో కార్మిక కుటుంబాలు నానా అవస్థలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.