మంచిర్యాల జిల్లాలో రోజురోజుకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కోటపల్లి మండలంలో మంగళవారం 10.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. జైపూర్ మండలంలో 10.7, వేమనపల్లి మండలం నీల్వాయిలో 10.8, జన్నారం మండలంలో 10.9, కోటపల్లి మండలం దేవులవాడలో 11.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయినట్లు అధికారులు వెల్లడించారు. వృద్ధులు, చిన్నారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.