మందమర్రి: భక్తిశ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు

59చూసినవారు
కార్తీక మాసంలో వచ్చే మొదటి పండుగ నాగుల చవితి వేడుకలను మందమర్రి పట్టణంలో మంగళవారం మహిళలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాము పుట్టలో పాలు పోసి తమ భక్తిని చాటుకున్నారు. అనంతరం నైవేద్యాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. పాలు పోసిన మహిళా భక్తులు తనకు తన కుటుంబానికి ఏ హాని తలపెట్టొద్దని తమ కుటుంబం ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ నాగదేవతను వేడుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్