Jan 01, 2025, 04:01 IST/
కేంద్రం గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ నిధులు పెంపు
Jan 01, 2025, 04:01 IST
అన్నదాతలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నూతన సంవత్సరం బహుమతి అందించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద అన్నదాతలకు అందిస్తున్న పెట్టుబడి సాయాన్ని పెంచుతున్నట్లు తెలిపారు. 2019 నుంచి మోదీ సర్కారు ఏటా రైతులకు రూ.6 వేలు పెట్టుబడి సాయం అందిస్తోంది. రూ.2 వేల చొప్పున 3 విడతల్లో రైతుల ఖాతాల్లో సొమ్మును జమ చేస్తున్నారు. ఈ మొత్తాన్ని ఇప్పుడు రూ.10 వేలకు పెంచుతున్నట్లు మోదీ ‘ఎక్స్’లో తెలిపారు. అలాగే దేశంలో పేదల కోసం మరో 2 కోట్ల ఇళ్ల నిర్మాణానికి సర్వే చేయాలని నిర్ణయించారు.