మంచిర్యాల జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా నియంత్రణపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటివరకు ఇసుక రీచ్ ల నుంచి మాత్రమే ఇసుక తీయడం జరిగిందని, సీసీ కెమెరాలు పర్యవేక్షణ కూడా ఉంటుందన్నారు.