వైద్య ఖర్చులకు ఆర్థిక సహాయం అందించిన కౌన్సిలర్

78చూసినవారు
వైద్య ఖర్చులకు ఆర్థిక సహాయం అందించిన కౌన్సిలర్
మంచిర్యాల మున్సిపాలిటీ 17వ వార్డు పరిధిలోని ఎల్ కె నగర్ కు చెందిన పిట్టల సతీష్ పేగు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. హైదరాబాదులో చికిత్స పొంది ఇంటికి వచ్చిన సతీష్ ను సోమవారం వార్డు కౌన్సిలర్ పూదరి సునీత ప్రభాకర్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని ధైర్యంగా ఉండాలని సూచించారు. అనంతరం వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందజేశారు. దాతలు సతీష్ కు ఆర్థిక సహాయం అందించాలని కోరారు.

ట్యాగ్స్ :