చిన్నారులకు టీకాలు తప్పనిసరిగా వేయించాలి

71చూసినవారు
చిన్నారులకు టీకాలు తప్పనిసరిగా వేయించాలి
చిన్నారులకు తల్లిదండ్రులు టీకాలను తప్పనిసరిగా వేయించాలని ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది సూచించారు. జన్నారం మండలంలోని బావాపూర్ గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు వివిధ వ్యాధులు రాకుండా టీకాలను వేశారు. టీకాలతో పిల్లలకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. ఆరేళ్ల లోపు చిన్నారులకు టీకాలను తప్పనిసరిగా వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది ఉన్నారు.