మందమర్రి: రేపు సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించాలి

73చూసినవారు
మందమర్రి: రేపు సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించాలి
మందమర్రి: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను శుక్రవారం ఐఎన్టీయూసి అధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్ గురువారం పిలుపునిచ్చారు. అన్ని ఏరియాల్లోని గనులు, డిపార్ట్మెంట్లు, బ్రాంచ్ కార్యాలయాల్లో జన్మదిన వేడుకలు జరపాలని తెలిపారు. ఈ వేడుకల్లో యూనియన్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.