అనారోగ్యంతో వలస కూలి మృతి

50చూసినవారు
అనారోగ్యంతో వలస కూలి మృతి
మంచిర్యాల పట్టణంలో ఒక వలస కూలీ అనారోగ్యంతో మృతి చెందినట్లు సీఐ బన్సీలాల్ తెలిపారు. లక్సెట్టిపేట మండలం చింతపల్లి గ్రామానికి చెందిన అక్కల తిరుపతి స్థానికంగా నూతనంగా నిర్మిస్తున్న భవనాల వద్ద వాచ్ మెన్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడన్నారు. ఆదివారం రైల్వే ఓవర్ బ్రిడ్జిపై నుంచి నడుచుకుంటూ వస్తుండగా అస్వస్థతకు గురై మృతి చెందాడని పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్