బీద కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ
నెన్నెల మండలం కుశ్నపల్లి గ్రామానికి చెందిన సముద్రాల సంతోష్ అనే వ్యక్తి ఆదివారం గురు పౌర్ణమి పండుగ సందర్భంగా గ్రామంలోని పలు బీద కుటుంబాలకు తోచిన సాయంగా నిత్యావసర సరుకులు, పిల్లలకు నోట్ బుక్స్, ప్లేట్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. విద్యాబుద్ధులు చెప్పిన ఉపాధ్యాయులు, సాంస్కృతిక సంప్రదాయాలు నేర్పిన గురువులు జీవితానికి ఆదర్శ ప్రాయులని కొనియాడారు.