కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటున్న మార్క్ జుకర్‌బర్గ్

52చూసినవారు
మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ కొత్త విద్యలను నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇందులో భాగంగా మెటా బాధ్యతలను చూసుకుంటూనే మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌తో పాటు సాహస క్రీడల్లో నైపుణ్యం పెంచుకుంటూ ఆశ్చర్యపరుస్తుంటారు. తాజాగా పదును, స్ట్రాంగ్‌నెస్‌కు ప్రసిద్ధి చెందిన జపనీస్ పురాతన కత్తి కటనా తయారీలో నైపుణాన్ని పెంచుకున్నారు. మాస్టర్ సహాయంతో తాను స్వయంగా తయారుచేసిన కత్తి వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.