భారీ అగ్ని ప్రమాదం (వీడియో)

78చూసినవారు
అసోంలోని కాచర్ జిల్లాలోని ఓ కంప్యూటర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో మంటల నుంచి తప్పించుకునేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. పైపుల ద్వారా బిల్డింగ్‌ పైనుంచి కిందకు దిగారు. ఈ క్రమంలో ఒక విద్యార్థిని జారి పడటంతో గాయపడింది. శనివారం మధ్యాహ్నం సిల్చార్‌ పట్టణంలోని కంప్యూటర్ శిక్షణా సంస్థలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఏడు ఫైర్‌ ఇంజిన్లు అక్కడకు చేరుకుని మంటలను ఆర్పివేశాయి.

ట్యాగ్స్ :