మేనల్లుడికి మాయావతి షాక్

84చూసినవారు
మేనల్లుడికి మాయావతి షాక్
బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి మంగళవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌కు ఊహించని షాక్ ఇచ్చారు. ఆయనను తన వారసుడిగా చేయాలనే నిర్ణయాన్ని మాయావతి ఉపసంహరించుకున్నారు. అంతేకాకుండా పార్టీలో ముఖ్యమైన పదవుల నుంచి ఆయనను తొలగించారు. దీనికి గల స్పష్టమైన కారణాలు తెలియలేదు. ఇప్పటి వరకు బీఎస్పీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిలో ఆకాష్ ఆనంద్ కొనసాగారు.