నూతన జాతీయ విద్యా విధానంపై అంగన్వాడిలకు అవగాహన సదస్సు
హత్నూర మండలం దౌల్తాబాద్ క్లస్టర్ కాసాల రైతు వేదికలో నూతన జాతీయ విద్యా విధానంపై అంగన్వాడీ టీచర్లకు అవగాహన సదస్సు కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి సిడిపిఓ శోభారాణి పాల్గొని మాట్లాడుతూ 3 నుండి 6 సంవత్సరాల అంగన్వాడి పిల్లలకు నాణ్యతతో కూడిన విద్య అందించడానికి కేంద్ర మహిళ శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన పూర్వ ప్రాథమిక సంరక్షణకు అనుగుణంగా విద్యా బోధనలో మార్పులు చేశారన్నారు.