ఆర్చ్ ఫార్మా కంపెనీలో బీఎంఎస్ విజయం
హత్నూర మండలం గుండ్ల మాచునూర్ గ్రామ పరిధిలో ఉన్న భారీ పరిశ్రమైన ఆర్చ్ ఫార్మా ల్యాబ్ లో సోమవారం జరిగిన కార్మిక సంఘం ఎన్నికల్లో బీఎమ్ఎస్ విజయం సాధించింది. సీఐటీయూపై భారతీయ మజ్దూర్ సంఘ్ గెలుపుపట్ల ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఏ. ప్రదీప్ కుమార్, జిల్లా అధ్యక్షులు తోట నరసింహారెడ్డిలు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో ప్రలోభాలు, బలవంతపు బెదిరింపులు చేసినా ఆర్చ్ ఫార్మా కార్మికులు బిఎంఎస్ ను గెలిపించారని ఆనందం వ్యక్తం చేశారు.