తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం అల్లాదుర్గ్ మండల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మండల అధ్యక్షులు గురుచరణ్ మాట్లాడుతూ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని సోమవారం అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రావ్, కోశాధికారి సంతోష్, కార్యదర్శి రుక్మిణి పాల్గొన్నారు.