మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల ఆలయం పరిధిలో ప్రవహిస్తున్న మంజీరా నదికి సోమవారం ఆలయ అర్చకులు గంగా హారతి కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. కార్తీక మాసం ఉత్సవాల్లో భాగంగా దుర్గా మత అమ్మవారికి ప్రదోషకాల పూజలు నిర్వహించి, ప్రత్యేక నక్షత్ర హారతి కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అశేషంగా పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు.