సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో 2వ వార్డ్ నర్సాపూర్ లో జరిగిన భారత ప్రధాని నరేంద్రమోడీ జన్మదిన వేడుకల్లో మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి వార్డ్ ప్రజలకు తినిపించారు. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ప్రజలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.