ఘనపూర్ ఎమ్ పి పి చే పి ఆర్ టి యు టి ఎస్ నూతన సంవ్సరం క్యాలెండర్ ఆవిష్కరణ

252చూసినవారు
ఘనపూర్ ఎమ్ పి పి చే పి ఆర్ టి యు టి ఎస్ నూతన సంవ్సరం క్యాలెండర్ ఆవిష్కరణ
ఈరోజు 04-01-2023 నాడు హావేలి ఘనపూర్ ఎమ్ పి డి ఒ కార్యాలయంలో ఎమ్ పి పి శ్రీ. శేరి నారాయణ రెడ్డి పి ఆర్ టి యు టి ఎస్ హావేలి ఘనపూర్ మండల శాఖ తరుపున 2023 పి ఆర్ టి యు టి ఎస్ క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. ఇట్టి సందర్భంగా ఎంపిపి నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బాగుకోసం రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు మనబడి కింద పాఠశాలలో అన్ని వసతులు సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి కృతనిశ్చయముతో ఉంది పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి అందుకు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు సహకరిస్తూ వచ్చే కొత్త సంవత్సరంలో చక్కగా బడులు బాగుకోసం ప్రయత్నం చేస్తూ మంచి ఫలితాలు సాధించాలని కోరడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మేడి సతీష్ రావు, ఆర్. సుభాష్ రెడ్డి, జిల్లా మాజీ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి, రాష్ట్ర బాధ్యులు వీరేందర్, శ్రీహరి, మల్లారెడ్డి , రఘుబాబు, జిల్లా బాధ్యులు రాజేందర్ రెడ్డి, రాఘవేందర్, సాయిలు, మండల బాధ్యులు వెంకటేశం, మధుసూదన్, పెంటయ్య, సందీప్ రెడ్డి, శ్రీనివాస రాజు, నరేందర్ రెడ్డి, ప్రేమ్ కుమార్, రవీందర్ రెడ్డి, కృష్ణ, కార్తికేయ పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్