మెదక్ జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల తరువాత మండలాల డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో మార్పులు, చేర్పులు జరగవచ్చున్నారు. ఇప్పటికే డ్రాఫ్ట్ ఓటర్ జాబితాను గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శించామని, వాటిని పరిశీలించి, వాటిలో అభ్యంతరాలను తెలపాలన్నారు.