'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్.. 1600 మంది పోలీసులతో బందోబస్తు

70చూసినవారు
'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్.. 1600 మంది పోలీసులతో బందోబస్తు
ఏపీలోని రాజమహేంద్రవరంలో గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్‌ నటించిన ‘గేమ్‌ ఛేంజర్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ శనివారం సాయంత్రం జరుగనుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా రాజకీయ, సినీ ప్రముఖులు రానున్న నేపథ్యంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. 400 మంది పోలీసు అధికారులు,1200 మంది పోలీస్ సిబ్బంది పాల్గొననున్నారు. కోల్‌కత్తా-చెన్నై NHపై, వేమగిరి, బొమ్మూరు వద్ద జాతీయ రహదారిపై ట్రాఫిక్ మళ్లించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్