శంకర్‌ను ఆ మాట అడగడానికి ధైర్యం చాల్లేదు: రామ్‌చరణ్‌ (వీడియో)

55చూసినవారు
ముంబైలో శనివారం 'గేమ్‌ ఛేంజర్‌' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా రామ్‌చరణ్‌ మాట్లాడుతూ.. "శంకర్‌ గొప్ప దర్శకుడు. శంకర్ ‘స్నేహితుడు’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు నేను ముఖ్య అతిథిగా హాజరయ్యాను. తెలుగు హీరోలతో ఒక సినిమా చేయమని శంకర్‌ను అడుగుదామనుకున్నా. ఆ సమయంలో నాకు అంత ధైర్యం లేకపోయింది. శంకర్‌ సార్ నాతో వర్క్‌ చేయాలని అన్నారంటే మొదట నిజం అనుకోలేదు. ఇన్నేళ్ల తరువాత ఈ చిత్రంతో నా కల నెరవేరింది." అని అన్నారు.

సంబంధిత పోస్ట్