రామాయంపేట శివారులో రోడ్డు ప్రమాదం
మెదక్ జిల్లా రామాయంపేట శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. రామాయంపేట నుంచి కామారెడ్డి వెళ్లే రహదారిపై ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. బైక్పై వెళ్తున్న ఇద్దరికీ గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను రామయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆర్టీసీ బస్సుడ్రైవర్ అజాగ్రత్త వల్లే రోడ్డు ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.