రామాయంపేటలో దడ పుట్టిస్తున్న వీధి కుక్కలు

53చూసినవారు
రామయంపేట మున్సిపాలిటీలో పలు కాలనీలో కుక్కల బెడద ఎక్కువవుతోంది. కుక్కలు గుంపులు గుంపులుగా స్వైర విహారం చేస్తున్నాయి. చిన్నా, పెద్దా అని తేడా లేకుండా అందరి పైన దాడి చేస్తున్నాయి. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. కుక్కల బెడద కారణంగా ఇంటి నుంచి బయటకు రావడానికి వృద్ధులు, పిల్లలు భయాందోళన చెందుతున్నారు. కుక్కల బెడదపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు శనివారం కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్