తూప్రాన్: ఎర్ర బూదమ్మ కుటుంబానికి ఆర్థిక సహాయం
మెదక్ జిల్లా తూప్రాన్ మండల్ మల్కాపూర్ గ్రామానికి చెందిన ఎర్ర భూదమ్మ ఇల్లు బుధవారం తెల్లవారుజామున కాలిపోవడం జరిగింది. ఇంట్లో ఉన్న సామాగ్రి పూర్తిగా కాలిపోవడం జరిగింది. విషయం తెలుసుకున్న సర్పంచ్ మన్నే మహాదేవి నవీన్ 50 కిలోల బియ్యం వారికి అందించారు. వార్డ్ సభ్యులు మన్నె మమత రూ 1000 ఆర్థిక సాయం అందించారు.