యువతి ఆత్మహత్య

349158చూసినవారు
యువతి ఆత్మహత్య
కుటుంబ ఆర్థిక పరిస్థితులతో మనస్థాపం చెందిన డిగ్రీ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణ కేంద్రంలో శుక్రవారం జరిగింది. ఎస్ఐ సుభాష్ తెలిపిన వివరాల ప్రకారం.. తూప్రాన్ మాజీ ఎంపీపీ గుమ్మడి శ్రీనివాస్, పద్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురు మాధురి (20) స్థానికంగా ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతోంది.

అయితే ఆమెకు త్వరలో పెళ్లి చేసేందుకు ఇంట్లో చర్చలు జరుపుతున్నారు. తనకు, చెల్లికి వివాహాలు చేసేసరికి మరింత ఆర్థిక భారం అవుతుందేమోనని మాధురి పలుసార్లు తల్లిదండ్రులకు తెలిపింది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం స్నానం చేస్తానని వెళ్లిన మాధురి ఎంతకూ రాకపోయేసరికి అనుమానం వచ్చిన తల్లిదండ్రులు స్థానికుల సాయంతో తలుపులు పగులగొట్టారు. అప్పటికే మాధురి ఉరి వేసుకొని ఉంది. 108 వాహనంలో ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 'రోడ్డు విస్తరణలో ఇల్లు పోయిందని బాధపడకు అమ్మా.. అని నాకు ధైర్యం చెప్పి నీవు వెళ్లిపోయావా బిడ్డా.' అంటూ తల్లి పద్మ రోదించడం ప్రతి ఒక్కరిని కలచి వేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్