రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

10302చూసినవారు
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
రోడ్డు దాటుతున్న యువకుడిని లారీ ఢీకొన్న ఘటనలో తల్లి కళ్ల ఎదుటే కొడుకు దుర్మరణం పాలైన హృదయ విదారక ఘటన బుధవారం తూప్రాన్ పురపాలిక పరిధిలోని అల్లాపూర్ టోల్ ప్లాజా వద్దచోటు చేసుకుంది. ప్రముఖ దిన పత్రిక ప్రచురించిన కథనం ప్రకారం తూప్రాన్ పరిధిలోని వెంకటాపూర్(పీటీ)కి చెందిన సదుల సందమ్మ, కొడుకు యోగి (28)బిక్షాటన తో జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో టోల్ గేట్ పక్కన 44వ జాతీయ రహదారి వద్ద బిక్షాటన చేస్తూ తూప్రాన్ వచ్చేందుకు రోడ్డు దాటుతున్న క్రమంలో హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న లారీ యోగిని ఢీకొట్టగా అక్కడికక్కడే మృతి చెందాడు. భర్తలేని సదమ్మ ఉన్న ఒక్క కొడుకు కళ్లెదుటే చనిపోవడంతో గుండెలు బాదుకుంటూ రోదించింది. నేను ఎవరికోసం బతకాలంటూ రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టెలా చేసింది. తన కొడుకును బ్రతికించాలని రహదారిపై వెళ్తున్న వారిని ప్రాధేయ పడిన తీరు అందరిని కలచివేసింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్