Feb 16, 2025, 17:02 IST/
విమాన లగేజీ నిబంధనలలో దుబాయ్ మార్పులు
Feb 16, 2025, 17:02 IST
దుబాయ్ వెళ్లే ప్రయాణికులకు అలర్ట్. ఇక నుంచి విమాన లగేజీ నిబంధనలలో మార్పులు చేస్తున్నట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. కొత్త రూల్స్ ప్రకారం హెరాయిన్, కొకైన్, మత్తు మందులు, గసగసాలు, తమలపాకులు, కొన్ని రకాల మూలికలు తీసుకెళ్లకూడదు. ఇక ఏనుగు దంతాలు, జూద వస్తువులు, ఖడ్గమృగం కొమ్ములు తీసుకెళ్లడం నేరం. పెయింటింగ్స్, రాతిశిల్పాలు, నకిలీ కరెన్సీ, ఇంట్లో వండిన ఆహారం సైతం ఈ జాబితాలో ఉన్నాయి.