హీరోయిన్ మీనాక్షి చౌదరి పేరు ప్రస్తుతం ఇండస్ట్రీలో మార్మోగిపోతోంది. తాజాగా మీనాక్షీ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తాను కలిసి పనిచేసిన హీరోల నుంచి ఏం నేర్చుకున్నారో చెప్పారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు నుంచి క్రమశిక్షణ, దళపతి విజయ్ నుంచి స్థిరత్వం, దుల్కర్ సల్మాన్ నుంచి వినయం, వరుణ్ తేజ్ నుంచి జెంటిల్ మెన్ స్వభావం, విశ్వక్ సేన్ నుంచి ఫన్ అని తెలిపారు. ఈ నెల 22న విడుదల కానున్న 'మెకానిక్ రాకీ' మూవీ అందరికీ నచ్చుతుందని అన్నారు.