ప్లగ్ ట్రేలలో విత్తనం విత్తే పద్దతి

56చూసినవారు
ప్లగ్ ట్రేలలో విత్తనం విత్తే పద్దతి
మొక్కల పెంపకానికి ప్లగ్ ట్రేలు ఉపయోగకరంగా ఉంటాయి. ఇవి మార్కెట్ లో దొరుకుతాయి. ఒక్కో ట్రేలో 50-100 వరకు రంధ్రాలు ఉంటాయి. ముందుగా విత్తన మోతాదుకు తగినన్ని ట్రేలు తీసుకోవాలి. వీటిలో కోకోపిట్, వర్మి కాంపొస్ట్, మట్టి.. మూడింటిని 1:2:2 నిష్పత్తిలో తీసుకొని ట్రే రంధ్రాలలో నింపాలి. తర్వాత ఒక్కో రంధ్రంలో ఒక విత్తనం నాటి మట్టి కప్పాలి. రోజుకు 2 సార్లు ఉదయం, సాయంత్రం రోజ్ క్యాన్ల సాయంతో మొక్కలకు నీరు పోయాలి. ఇలా పెంచడం వల్ల మొక్కలు ఆరోగ్యవంతంగా పెరుగుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్