లడఖ్‌లోని లేహ్ ప్రాంతంలో మంగళవారం ఉదయం స్వల్ప భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై 4.5 తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సీఎస్) తెలిపింది. 34.73 అక్షాంశాలు-77.07 రేఖాంశాల వద్ద 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అకస్మాత్తుగా భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు.