మంచు కుటుంబంలో గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఏకంగా మంచు విష్ణు, మంచు మనోజ్ దాడులు చేసుకునేవరకు రావడంతో కాసేపటి క్రితం మంచు మనోజ్, భార్య మౌనికతో కలిసి ఇంటెలిజెన్స్ చీఫ్, అడిషనల్ డీజీ శివధర్ రెడ్డిని కలిశారు. తన కుటుంబంలో జరుగుతున్న పరిణామాలపై అడిషనల్ డీజీకి వివరించారు. ఈ సందర్భంగా తనకు రక్షణ కల్పించాలని శివధర్ రెడ్డిని కోరినట్లు సమాచారం.